జీతం పెరగకపోయినా డబ్బులు ఎలా సేవ్ చేయాలి

ఒక రోజు ఉదయం రాజా ఫోన్‌లో బ్యాంక్ బ్యాలెన్స్ చూసి షాక్ అయ్యాడు.జీతం వచ్చి ఇంకా 10 రోజులు కూడా కాలేదు.కానీ అకౌంట్ దాదాపు ఖాళీ “జీతం పెరగడం లేదు… కానీ ఖర్చులు మాత్రం పెరుగుతున్నాయి” అని అతడు ఆలోచించాడు.అదే రోజు ఆఫీస్‌లో తన స్నేహితుడు వెంకీ ని అడిగాడు “నువ్వు నెల చివరికి కూడా డబ్బులు ఎలా సేవ్ చేస్తున్నావు?” వెంకీ నవ్వుతూ చెప్పాడు


రోజువారీ ఖర్చులు రాసుకోవడం అలవాటు చేసుకో రాజా అప్పుడు నీకు అర్థం అవుతుంది మొదట నేను ఏం చేశానో తెలుసా? రోజూ ఎంత ఖర్చు చేస్తున్నానో చిన్న నోట్స్ యాప్‌లో రాసుకోవడం మొదలుపెట్టాను.”టీ – కాఫీ ఆన్‌లైన్ ఆర్డర్లు ట్రావెల్ ఖర్చులు.ఇవి కలిస్తే నెల చివరికి పెద్ద అమౌంట్ అవుతుందని రాజా అర్థం చేసుకున్నాడు. వెంకీ రాజాతో ఇలా చెప్పాడు. బయట తినడం తగ్గించు – ఇంటి ఫుడ్ పెంచు రోజూ బయట టీ, బిస్కెట్లు, ఫాస్ట్ ఫుడ్…ఒక్కోసారి చిన్న ఖర్చుల్లా అనిపించినా.నెలకు వేల రూపాయలు ఖర్చవుతాయి.ఇంట్లో చేసిన ఆహారం ఆరోగ్యానికి మంచిది.జేబుకి కూడా మంచిది. అని చెప్పాడు.




అవసరం ఉందా? లేదా కావాలా?


వెంకీ చేప్పిన గోల్డెన్ రూల్ “కొనేముందు ఒకసారి అడుగు. ఇది అవసరమా? లేక కేవలం కావాలా?” కొత్త హెడ్‌ఫోన్.
కొత్త డ్రెస్  లేటెస్ట్ గ్యాడ్జెట్..అన్ని వెంటనే కొనాల్సిన అవసరం లేదు.జీతం వచ్చాక. చివర్లో సేవ్ చేద్దాం అనుకోవద్దు..ముందే సేవ్ చేసేయాలి 20% డబ్బు సేవింగ్స్ అకౌంట్ / RD / SIPకి పంపించాలి
మిగిలిన డబ్బుతోనే ఖర్చులు చేయాలి.రోజూ:₹50 టీకి ₹100 ఆన్‌లైన్ ఆర్డర్‌కి.నెలకు = ₹4,500 ఇదే డబ్బు సేవ్ చేస్తే:ఎమర్జెన్సీకి
ఫ్యూచర్ ప్లాన్స్‌కి మైండ్ పీస్‌కి ఉపయోగపడుతుంది.ఖర్చు చేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేయండి.డబ్బులు సేవ్ చేయడం అంటే కష్టపడటం కాదు,స్మార్ట్‌గా ఖర్చు చేయడం నేర్చుకోవడం.రాజా ఇప్పుడు:స్ట్రెస్ లేకుండా సేవింగ్స్‌తో. ప్లాన్డ్ లైఫ్ జీవిస్తున్నాడు.మీరు కూడా ఈరోజే మొదలుపెట్టండి.
చిన్న అడుగులే పెద్ద మార్పుకు కారణం 

డబ్బులు సేవ్ చేయాలంటే – రోజువారీ అలవాట్లు ఎలా మార్చుకోవాలి?


రాజా ఇప్పుడు ఒక్క నిర్ణయం తీసుకున్నాడు.“జీతం పెరిగే వరకు వేచి ఉండకూడదు…నా అలవాట్లే మార్చుకోవాలి”అతడు కొన్ని చిన్న మార్పులు మొదలుపెట్టాడు.ఆన్‌లైన్‌లో ఆఫర్స్ చూసినప్పుడల్లా కొనేయడం కాకుండా“కొనాలనిపిస్తే 24 గంటలు ఆగు” నిజంగా అవసరమైతే మళ్లీ కొనాలనిపిస్తుంది.అవసరం లేకపోతే ఆసక్తి తగ్గిపోతుంది..ఇలా చేస్తే చాలా డబ్బు సేవ్ అవుతుంది.డిస్కౌంట్ అనే మాటకు మోసపోవద్దు“50% OFF”“LIMITED OFFER
ఇవి మన మనసుతో ఆడే ట్రిక్స్..ఆ వస్తువు అసలు అవసరమా?డిస్కౌంట్ లేకపోయినా కొంటావా? ఈ రెండు ప్రశ్నలకు “అవును” అయితేనే కొనాలి. గుర్తుపెట్టుకోండి ఆన్లైన్ షాపింగ్ లు చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని తీసుకోండి.


చిన్న దూరాలకు నడక / సైకిల్ మీద వెళ్లడం మంచిది సపోజ్ ..మీ ఆఫీస్ దగ్గరే ఉంటే:ఆటో బైక్..తగ్గించి నడక అలవాటు చేసుకుంటే:
పెట్రోల్ సేవ్....హెల్త్ బాగుంటుంది రోజువారీ ఖర్చులు తగ్గుతాయి. ఒక్కసారి ఆలోచించండి ఇందులో నేనేమి మీరు ఇలానే ఉండాలని చెప్పట్లేదు అన్నా అలవాటు చేసుకుంటే మంచిది అంటున్నాను. ఇంకా మీరు డబ్బులు సేవ్ చేయాలి అనుకుంటే ఈ అలవాట్లు కూడా తగ్గించుకుంటూ పోతే మంచిది...నెలకు డబ్బులు కట్ అవుతున్నాయి కానీ వాడటం లేదే? OTT సినిమాలు..మ్యూజిక్ యాప్స్..క్లౌడ్ స్టోరేజ్.వాడని వాటిని వెంటనే క్యాన్సిల్ చేయండి. చాలా బెస్ట్ ఆప్షన్.

మీకంటూ ఒక చిన్న లక్ష్యం పెట్టుకోండి.అవి ఇలా ఉండాలి,నెలకు ₹3,000 సేవ్ చేస్తాను“ఈ ఏడాది ₹50,000 సేవ్ చేస్తాను”లక్ష్యం ఉంటే: ఖర్చు చేసే ముందు ఆలోచన వస్తుంది సేవింగ్స్ ఆటోమేటిక్‌గా పెరుగుతాయి.నిజ జీవిత నిజం చెప్పాలంటే.
డబ్బులు సేవ్ చేయడం అంటే:ఆనందం త్యాగం చేయడం కాదు
అనవసర ఖర్చులు తగ్గించడం.స్మార్ట్‌గా ఖర్చు చేస్తే
 జీవితం కూడా స్మార్ట్‌గా ఉంటుంది.తెలుసుకోండి. మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ సంతోషంగా ఉంటారు. మీరు కూడా ఒకసారి ఆలోచించండి. మీ తోటి వారికి కూడా చేయమని చెప్పండి అలా మీరు చెప్పింది మాటలు విని వాళ్లు మారితే అలా వారి కుటుంబం కూడా బాగుంటుంది. 


#Moneysave #saveformoney