లాభాలు:

క్రెడిట్ కార్డులు తక్షణ అవసరాలకు ఉపయోగపడతాయి. నగదు లేకపోయినా కొనుగోళ్లు చేయవచ్చు. ఆన్‌లైన్ షాపింగ్, బిల్లుల చెల్లింపులు సులభం. క్యాష్‌బ్యాక్, రివార్డ్ పాయింట్లు, డిస్కౌంట్లు లభిస్తాయి. క్రెడిట్ హిస్టరీ మెరుగుపడి భవిష్యత్తులో లోన్లు పొందడానికి ఉపయోగపడుతుంది. అత్యవసర పరిస్థితుల్లో సహాయపడుతుంది. కానీ మీరు ఇక్కడే ఒకటి గమనించాలి.మీ క్రెడిట్ కార్డ్ లో ఉన్న లిమిట్ మొత్తం.వాడకూడదు అంటే మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ లక్ష రూపాయలు అందులో 30% మాత్రమే వాడుకోవాలి 30% అంటే 30000 రూపాయలు మాత్రమే మీరు అందులో నుంచి వాడుకోవాలి. అలా మీరు వాడినట్లు అయితే. మీకు సిబిల్ స్కోర్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది. మీకు పర్సనల్ లోన్స్ కానీ హోమ్ లోన్స్ కూడా త్వరగా లోన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.ఇంక ఆధార్ బ్యాంక్స క్రెడిట్ కార్డ్ కూడా వస్తాయి. క్రెడిట్ కార్డ్ వాళ్ల ఎంత లాభం ఉందో అంతే నష్టం కూడా ఉంది


నష్టాలు:

 

సమయానికి బీల్స్  EMIs  చెల్లించకపోతే అధిక వడ్డీ పడుతుంది. అవసరం లేని ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అప్పుల భారం పెరుగుతుంది. కార్డు మిస్ అయితే దుర్వినియోగం ప్రమాదం ఉంది. వార్షిక ఫీజులు ఉండవచ్చు. క్రెడిట్ స్కోర్ కూడా చాలా అంటే చాలా తగిపోతుంది. అలానే మీ క్రెడిట్ కార్డ్ కూడా బ్లాక్ చేయబడుతుంది.మీరు బీల్స్ కాట్టకుండా అలానే వదిలేస్తే. మీరు కాట్టాల్సిన దానికన్నా వడ్డీ ఎక్కువ ఉంటుంది.తస్మాత్ జాగ్రత్త క్రెడిట్ కార్డ్ ఉంది కదా అని. మీ అవసరానికి మించి వాడకూడదు.అలా ఎక్కువ ఎక్కువగా వాడితే మీరు అప్పులు పాలు అవుతారు.మీ నెలవారీ జీతం మొత్తం. ఇలా క్రెడిట్ కార్డ్ లాకు కాపాడుకుంటూ ఉండాలి.అందుకే ఒక్కసారి ఆలోచించి ఖర్చు చేయండి.


క్రెడిట్ కార్డుల క్యాష్‌బ్యాక్ పొందడం ఇలా 👇


మంచి కార్డు ఎంచుకోండి.వివిధ కార్డులు వివిధ వర్గాల మీద క్యాష్‌బ్యాక్ ఇస్తాయి సూపర్‌ మార్కెట్, పెట్రోల్ ఆన్‌లైన్ షాపింగ్ మూవీ టికెట్స్ ఆన్లైన్ ఫుడ్స్ ఇలా ఎన్నో రకాలుగా క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఇస్తాయి.మీ ఖర్చు అలవాట్లకి సరిపోయే కార్డును ఎంచుకోవాలి.ఏ రకమైన ఖర్చు, ఎన్ని % క్యాష్‌బ్యాక్ ఇస్తుందో.ఫస్ట్ తెలుసుకోండి.కొన్ని క్రెడిట్ కార్డ్ లు నెల చివరలో బ్యాంక్ అకౌంట్ కి డైరెక్ట్‌గా ఇస్తాయి, కొన్ని రివార్డ్ పాయింట్లుగా వస్తాయి.అలా వచ్చినా రివార్డ్ పాయింట్లను షాపింగ్ కోసం, బిల్లులు చెల్లించడానికి లేదా డైరెక్ట్ క్యాష్‌బ్యాక్‌గా మార్చుకోవచ్చు.



సమయానికి బిల్లులు చెల్లించకపోతే ఏమవుతుంది?


సమయానికి బిల్లు చెల్లించకపోతే వడ్డీ క్యాష్‌బ్యాక్ లాభాన్ని మించిన మేర పెరుగుతుంది.గుర్తుపెట్టుకోండి ఎక్కువగా ఖర్చు చేసి క్యాష్‌బ్యాక్ పొందడం సరైన విధానం కాదు; అవసరమైన ఖర్చుల కోసం మాత్రమే ఉపయోగించాలి. అలా చేస్తే మీరు అప్పుడు భారం నుంచి బయటపడతారు లేదంటే మీరు అప్పులు చేయాల్సి వస్తుంది అలానే మీకు ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ఒక్కసారి ఆలోచి ఉంచుకోవాలి. మీకు క్రెడిట్ కార్డు అనేది అసలు అవసరం ఉందా లేదా అనే దాని గురించి ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని తీసుకోండి. ఒకవేళ నిజంగా అవసరమే అయితే తప్పనిసరిగా తీసుకొని. దానిని జాగ్రత్తగా వాడుకోవడం అలవాటు చేసుకోండి ఉంది కదా అని చిన్నదానికి పెద్దదనికి వాడకూడదు అలా వాడితే మీరే ప్రాబ్లంస్ లో పడతారు. అవసరము లేదు అనుకుంటే దానిని అవాయిడ్ చేయండి చాలా మంచిది మీ జీవితానికి మించి ఖర్చులు చేయడం కూడా మంచిది కాదు. అలా చేస్తే మీ ఫ్యామిలీ మొత్తం రిస్క్ లో పడుతుంది. కార్డు తీసుకోవడం అనేది సులభమైన పని కానీ దానిని సరైన పద్ధతిలో వాడకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. గమనిక ఇక్కడ మేము చెప్తుంది ఏమిటి అంటే మిమ్మల్ని క్రెడిట్ కార్డు తీసుకోమని కానీ తీసుకోవద్దు అని కానీ ఇక్కడ ఎక్కడా చెప్పటం లేదు మీ అవసరాలను బట్టి. క్రెడిట్ కార్డులు పర్సనల్ లోన్స్ తీసుకోమని చెప్తున్నాము అంతేకానీ ఇక్కడ ఎలాంటి దురుద్దేశం లేదు.


#Savemoneytelugu #Savemoney #creditcards